హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియకు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యా ప్తంగా 119 నియోజకవర్గాల్లో 2,290 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు కాగా, 222 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో 3,26,18,205 మంది ఓటర్లలో 1,63,13,268 మంది పురుషు లు, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. పీడబ్ల్యూడీ (దివ్యాంగులు) ఓటర్లు 5,06,921, థర్డ్ జెండర్లు 2,676 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 2,944 మంది నమోదు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ లో సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని బిఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి మరీ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. అక్కడ ఈవీఎం సమస్యతో ఇబ్బంది తలెత్తగా క్యూలైన్లో నిలబడిన అల్లు అర్జున్ ఎట్టకేలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓబుల్ రెడ్డి స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకు నేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకో వటం ఆసక్తిని కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తల్లి ఓటు వేయ డానికి వచ్చారు . షాద్ నగర్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇలా అభ్యర్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియో గించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని పిలుపునిస్తున్నారు. బంజారాహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు. పట్టణాల్లో ఓటింగ్ తక్కువ అన్న చెడ్డపేరు ఉందని అన్నారు. కాబట్టి.. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు.
Leave a comment