Bharatha Sakthi

ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన రూ.7.98కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలు

Bharath Sakthi 08/01/2025
Updated 2025/01/08 at 6:39 PM

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి : నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి హన్మంతరావు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం నమోదైన 71కేసుల్లో నిషేధిత మత్తు పదార్థాలైనటువంటి ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన రూ.7.98కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు జిల్లా ఎక్సైజ్ అధికారి హన్మంత్ రావు తెలిపారు. జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ లో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం 1285.25 కేజీల ఎండు గంజాయి, 32.585 కిలోల అల్ప్రా జోలం, 71.845 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలు కాల్చి వేసినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు విజయ్ కుమార్, మధుసూదన్ రావు, షాకిర్ అహ్మద్, సత్యనారాయణ, ఎస్సై విక్రమ్ కుమార్, నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

Share this Article