న్యూఢల్లీి, సెప్టెంబర్ 29
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఢల్లీిలోని కీర్తినగర్‌లోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించారు. అక్కడి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. జీవనం ఎలా సాగుతోందంటూ ఆరా తీశారు. ఆ వీడియోలు, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. అందులో రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేశారు. వారితో ముచ్చటించారు. సోషల్ విూడియా సైట్ ఎక్స్ (ట్విటర్)లో రాహుల్ గాంధీ షేర్ స్పందిస్తూ.. ‘ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్ అయిన ఢల్లీిలోని కీర్తి నగర్‌కు వెళ్లాను. అక్కడ కార్పెంటర్ సోదరులను కలిశాను. వారు చాలా కష్ట పడి పనిచేస్తున్నారు, అద్భుతమైన కళాకారులు, నాణ్యమైన, దృఢమైన, అందమైన వాటిని రూపొందించడంలో వీరు ప్రవీణులు!’ అంటూ రాసుకొచ్చారు. కొన్ని ఫొటో కూడా పోస్ట్ చేస్తూ.. కార్మికులతో చాలా సంభాషణలు జరిగాయని చెప్పారు. వారి నైపుణ్యాల గురించి కొంచెం తెలుసుకోవడానికి యత్నించానని, కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించానని అన్నారు. తెలంగాణ సహా ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. అంతే కాదు ప్రణాళికలను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య` రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాధారణ పౌరుడిలా గురువారం మధ్యాహ్నం ఢల్లీిలోని కీర్తినగర్‌కు వెళ్లారు. కార్పెంటర్ షాపులను సందర్శించారు. వడ్రంగులతో ముచ్చట్లు పెట్టారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతోన్న వేతనాల గురించి ఆరా తీశారు. కొద్దిసేపు చెక్కలకు తోప్డా పట్టారు. సెప్టెంబర్ 21న ఢల్లీిలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో రాహుల్ గాంధీ పోర్టర్లతో మమేకం అయ్యాడు. వాళ్లతో చాలా సేపు మాట్లాడారు. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆ తరవాత పోర్టర్ డ్రెస్ వేసుకున్నారు. బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు. అంతే కాదు. కూలీలా ఓ సూట్‌కేసుని కూడా మోశారు రాహుల్. చుట్టూ వందలాది మంది కూలీలు సందడి చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలను నిర్వహించారు. ఆ సమయంలో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు రైలులో ప్రయాణించారు. ఆగస్టులోనూ రాహుల్ ఢల్లీిలోని ఆజాద్‌పూర్ మండీకి వెళ్లారు. అక్కడ పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిసి మాట్లాడారు. కూరగాయల ధరలు పెరుగుదలపై మాట్లాడేందుకు వెళ్లారు. జులైలో ఢల్లీి నుంచి షిమ్లాకు వెళ్తున్న సమయంలో హరియాణాలోని రైతులను కలిశారు రాహుల్. పొలంలోకి దిగి రైతులతో మాట్లాడారు. వారితో పాటు నాట్లు కూడా వేశారు. ట్రాక్టర్‌తో దున్నారు. రైతు కూలీలతోనూ మాట్లాడారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మెకానిక్‌ల నుంచి విద్యార్థుల వరకు సమాజంలోని వివిధ వర్గాలతో మమేకం అవుతున్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు.
Leave a comment