భారత శక్తి ప్రతినిధి, విజయవాడ, మార్చి 11:
సోమవారంనాడు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్విస్ ఆఫీసర్ శ్రీ రాజేందర్ చౌదరి పత్రికా సమాచార కార్యాలయం మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం)గా బాధ్యతలు స్వీకరించారు.శ్రీ రాజేందర్ చౌదరి భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికల రిజిస్ట్రార్‌గా, అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు.
శ్రీ రాజేందర్ చౌదరి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1997 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో కూడా వివిధ హోదాల్లో పని చేశారు.
మునుపు రెండు మంత్రిత్వ శాఖల్లో పని చేసే సమయంలో శ్రీ రాజేందర్ మీడియా మరియు కమ్యూనికేషన్స్‌లోనూ కీలక పదవులను చేపట్టారు. అలాగే రెండు మంత్రిత్వ శాఖలకు భారత ప్రభుత్వ ఐఈసీ కంటెంట్‌ను రూపొందించడంలో ఆయన పాత్ర చాలా కీలకం అని చెప్పచ్చు.
శ్రీ రాజిందర్ గొప్ప కమ్యూనికేటర్ మరియు మాస్ స్కేల్‌లో మీడియా ప్లానింగ్ మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ టెక్నిక్‌లలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. అనగా పాన్-రీజియన్ మరియు పాన్-ఇండియా కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఆయన దిట్ట అని చెప్పచ్చు. ఆయన “జాగో గ్రాహక్ జాగో” అనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రచారానికి సైతం నాయకత్వం వహించారు. దీని కోసం ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో పని చేసే సమయంలో అందుకున్న విజయానికిగానూ చక్కని ప్రశంసలు సైతం అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా బాధ్యతలు చేపట్టడానికి ముందు శ్రీ రాజేందర్‌గారు భువనేశ్వర్‌లో ప్రధాన కార్యాలయంలో ఉత్తర ప్రాంతానికి ఏడీజీగా పని చేశారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలైన చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్.. వంటి వాటిని కవర్ చేస్తూ తూర్పు ప్రాంతపు ఏడీజీగానూ పని చేశారు.
ప్రాంతీయ ఏడీజీగా ఆయన ఆయా ప్రాంతాల్లోని భారత ప్రభుత్వ మీడియా కార్యాలయాలన్నింటికీ అధిపతిగా వ్యవహరిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతంలో సంస్థ చేపట్టే అన్ని కమ్యూనికేషన్స్ పనుల్లోనూ నేరుగా ఆయన పాల్గొంటారు.
శ్రీ రాజేందర్ చౌదరి అడిషనల్ ప్రెస్ రిజిస్ట్రార్ హోదాలో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాకూ నాయకత్వం వహిస్తారు.