ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వానలు తగ్గుముఖం పటటాయి. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పంట పోలాలు జలమయమైయాయి. గురువారం ఉదయం కుడా వరి పోలాలు, ధాన్యం రాశులు వర్షపు నీటిలోనే తెలియాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. తుఫాన్ కారణంగా జిల్లాలో సుమారు 23,661 హెక్టార్లలో పంట నష్టం కాగా, వివిధ మౌలిక వసతులు దెబ్బతినడం కారణంగా సుమారు రూ.188 కోట్లు నష్టం వాటిల్లింది. 19 మండలాల్లోని 113 గ్రామాలు తుఫాను కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాలు, ఈదురు గాలులు తాకిడికి గురయ్యాయి. 19 గ్రామాలలో, నాలుగు మున్సిపాలిటీ లోని కొన్ని ప్రాంతాల్లో నీరు చేరింది. 4,090 మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. 26 గృహాలు పూర్తిగా దెబ్బతినగా 79 గృహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 423.53 కిలోవిూటర్ల మేర ఆర్ అండ్ బి రహదారులు దెబ్బతిన్నాయని ఆమె వెల్లడిరచారు.