సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో రేప్కో హోమ్ ఫైనాన్స్ కార్యాలయాన్ని సోమవారం రెప్కో హోమ్ ఫైనాన్స్ రీజనల్ డెవలప్మెంట్ మేనేజర్ చింత శ్రీధర్ ప్రారంభించారు.గృహ అవసరాలకు, వ్యాపారులకు, చిరు వ్యాపారులకు, ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగులకు, పెన్షనర్లకు అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారుగా 60 బ్రాంచ్ లు ప్రారంభించినట్లు, సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార పరంగా దినదినాభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నూతనంగా బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో సైతం మా బ్రాంచ్ లను ఏర్పాటు చేసి సులభతరమైన పద్ధతుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆర్.సెల్వం, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ జి లింగరాజు, జువెలరీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా నాయకులు అంతటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.