సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు. ఆయను మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కలిసారు
కేసీ వేణుగోపాల్‌తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడానికి వెళ్లారు. అనంతరం సోనియాగాంధీతో భేటి కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. బుధవారం
పార్టీ పెద్దలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ తదితరులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. పార్టీ పెద్దలందరినీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.