మోకాలు నొప్పులతో బాధపడే వారికి అత్యాధునిక పద్ధతైన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఎంతో ఉపయోగపడు తుందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి డాక్టర్ దాచేపల్లి సునీల్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ జాజు హోటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో చదువు అభ్యసించిన అనంతరం 10 సంవత్సరాలు లండన్ లో అత్యాధునిక పద్ధతుల ద్వారా శిక్షణ పొందానని 2014లో భారతదేశానికి వచ్చి ఇప్పటివరకు అన్ని రకాల ఆపరేషన్స్ కలిపి 18000 పైగా చేశానని తెలిపారు. భారతదేశంలో నేను చేస్తున్న సేవలు గుర్తించి బ్రైటింగ్ టన్ హాస్పిటల్ మాంచెస్టర్ ఉత్తర కొరియా వారు ఆరు నెలల క్రితం నా సేవల గాను స్వర్ణ పథకం అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ సైన్స్ వారు నా సేవలో ఒక నెల క్రితం లెజెండ్ ఇన్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అవార్డుని అందించారని పేర్కొన్నారు. మోకాళ్ళ అరుగుదలను ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని నిత్య జీవితంలో ఇబ్బందుల కు గురికాకుండా ఉండాలంటే ఈ పద్ధతి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ ఆపరేషన్ అనంతరం స్వల్ప సమయంలో ఫిజియోథెరపి పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, ఇటీవల సూర్యపేట కు చెందిన అర్చకులు మంత్రమూర్తి శంకరా మూర్తి, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సంజీవరావు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆపరేషన్ అనంతరం త్వరగా కోలుకున్నామని చెప్పారు. ఆరోగ్య భద్రత, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఈ హెచ్ ఎస్, అన్ని రకాల ఇన్సూరెన్సులు వర్తిస్తాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ యు, పరమేష్ అసిస్టెంట్ మేనేజర్ టి. రాంప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు