ముంబై, డిసెంబర్ 6
ఫారెక్స్ రింగ్‌లో అమెరికన్ డాలర్ బలం ముందు రూపాయి నిలబడలేకపోతోంది, రోజురోజుకూ నీరసపడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరోమారు జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయి తన జీవిత కాల కనిష్ట స్థాయి రూ.83.41కి చేరుకుంది. ఇందులో, ప్రారంభ ట్రేడిరగ్‌లోనే 3 పైసల పతనం నమోదైంది. దేశంలోకి దిగుమతులు పెరుగుతున్నాయి. చెల్లింపుల కోసం వాళ్లకు డాలర్లు కావాలి. ఈ నేపథ్యంలో, దేశీయ దిగుమతిదార్ల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ కారణం వల్లే రూపాయి క్షీణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ద్రవ్య విధానాన్ని సవిూక్షించడం ప్రారంభిస్తుంది, సమావేశం ఫలితం శుక్రవారం వెలువడుతుంది. డాలర్లకు డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారి 83.50 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు.ట్రేడిరగ్‌లో కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది, రూ. 83.38 వద్ద ముగిసింది. మరోవైపు, అమెరికా నుంచి కీలక ఆర్థిక డేటా కూడా విడుదల కావల్సి ఉంది, రూపాయి విలువపై అది స్పష్టమైన ప్రభావం చూపుతుంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో ఙూ డాలర్ స్థితిని ప్రతిబింబించే డాలర్ ఇండెక్స్ 103.62 స్థాయి వద్దకు చేరింది, 0.09 శాతం క్షీణించింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 0.05 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.99 డాలర్ల వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (ఈఎఎబ ఆజీబిజీ) సోమవారం రూ. 2,073.21 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నెట్ సెల్లర్స్‌గా ఉన్న ఎఫ్‌ఐఐలు, నవంబర్ నెలలో నెట్ బయ్యర్స్‌గా టర్న్ అయ్యారు. అదే పంథా డిసెంబర్ ప్రారంభంలోనూ కొనసాగుతోంది. ఇప్పుడు అందరి చూపు రెపో రేటుపైనే ఉంది. అయితే, ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు పడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో, తన స్టాండ్‌లో ఖీఃఎ ఎటువంటి మార్పు చేయకపోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు ఓఖఅ సమావేశాలు జరిగాయి. ఆ నాలుగు సమావేశాల్లోనూ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.
Leave a comment