Bharatha Sakthi

ఆస్తికోసం ప్రాణ స్నేహితుడే ఆరుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపిన ఘటన

Bharath Sakthi 20/12/2023
Updated 2023/12/20 at 5:38 AM

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, డిసెంబర్ 20: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 తారీకు డిసెంబర్ రోజు పద్మాజివాడి నుండి గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో బొంపల్లి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని ఆడ మనిషి శవం కాల్చివేయబడి ఉందని సమాచారం రాగా సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ సిబ్బందితో సహా అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతీ వయసు సుమారు 20, 25 మధ్యలో ఉందని ఆమెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పెట్రోల్ తో కాల్చివేసినట్టు గుర్తించారు. కాగా ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ,ఆ యువతి యొక్క వివరాల గురించి ఎన్నో కోనాలలో విచారన చేపట్టారు. సిఐ సదాశివ నగర్ , ఎస్ఐ సదాశివ నగర్ , వారి సిబ్బందితో టీములుగా ఏర్పాటు చేసినారు. టీములు గా ఏర్పడిన అధికారులు కొన్ని రకాల విచారణ చేసి క్లూలు సంపాదించారు. ఈ నేరానికి పాల్పడిన నేరస్థుడు మేడిద ప్రశాంత్ ను మరియు అతనితో పాటు ఉన్న మరో నలుగురిని మంగళవారం ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు పట్టుకున్నారు. మీద ప్రశాంత్ మరియు అతనితో పాటుగా ఉన్న గుగులోతు విష్ణు భానోతు వంశీ లను పూర్తిస్థాయిలో విచారణ చేయగా. మేడిదే ప్రశాంత్ మాక్లూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. 2018 సంవత్సరంలో పూణే ప్రసాద్ అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో అతనిపై సెక్షన్ 354 డి, 306 ఐపిసి కేసు రిజిస్టర్ చేశారు. అయితే ప్రసాద్ అప్పటికే దుబాయ్ వెళ్లిపోగా అతనిపై కేసు పెండింగ్లో ఉంది.

ఆ క్రమంలో ప్రసాద్ ప్రశాంత్ తో మాట్లాడుతూ కేసు వివరాలు ఊర్లో పరిస్థితిని తెలుసుకున్నాడు. తిరిగి ప్రసాద్ 2022 అక్టోబర్ నెల ఆఖరిలో భారత దేశానికి వచ్చాడు. అతనిని మాక్లూర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినారు. ప్రసాద్ దుబాయ్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ కు దాదాపుగా మూడు లక్షల 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చినాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ కుటుంబాన్ని గ్రామస్తులు ఊర్లో ఉండనీయక పోవడం వల్ల ప్రసాద్ అతని భార్య పిల్లలు ఇద్దరు చెల్లెలు మరియు తల్లితో సహా మాచారెడ్డి పిఎస్ పరిధిలో ఉన్న పాల్వంచ గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు. ప్రసాద్ కు జైలుకు వెళ్లడం ఊర్లో ఉండకపోవడం వల్ల అప్పులు ఎక్కువ అయ్యాయి. కాబట్టి ప్రశాంత్ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారు. ప్రశాంత్ తర్వాత డబ్బులు లేకపోవడంతో రేపు మాపంటు కాలం గడిపినాడు. ఈ క్రమంలోనే ప్రసాదుకు ఉన్నటువంటి ఇల్లు మరియు స్థలాన్ని కుదువబెట్టి డబ్బులు ఇవ్వాలని తెలిసిన వారి వద్ద ప్రయత్నం చేయగా అందుకు ఎవరు సహకరించలేదు ఈ క్రమంలోనే ప్రసాద్ ప్రశాంతును సంప్రదించగా మార్ట్ గేజ్ పెట్టి లోన్ తీసుకోవచ్చని ఆ ల్యాండ్ ను తన పేరు మీద చేయిస్తే లోన్ ఇప్పిస్తానని చెప్పగా ప్రసాద్ ఆ భూమిని ఇంటితో సహా ప్రశాంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. దీనిలో మార్కెట్లో సుమారు 20 నుండి 25 లక్షల వరకు ఉంటుంది.

అప్పటినుండి లోనికి ఇస్తానంటూ కాలయాపన చేశాడు ప్రసాద్ తనకు కచ్చితంగా డబ్బులు కావాలని లేదా లోన్ ఇప్పియ్యాలని ప్రశాంత్ ని అడగగా ఎప్పటినుండో ప్రశాంత్ ప్రసాద్ యొక్క ఆస్తి పైన కన్ను వేసి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మరియు ఊర్లో ఎలాగూ వీళ్లను రానివ్వరని ఉద్దేశంతో అతని ఆశ దక్కించుకోవాలని కుట్రపాన్ని అతడిని చంపేస్తే ఊర్లో అతడిని గురించి గానీ అతని ఆస్తిని గానీ అడిగే వారు ఉండరని అనుకున్నాడు. ప్రసాద్ ని మరియు అతని కుటుంబ సభ్యులను చంపివేస్తే ఆ ఊర్లో ఉన్న ఆస్తి మరియు డబ్బులు తానే దక్కించుకోవచ్చని ఆలోచించాడు. అతని ప్లాన్ లో భాగంగా ఈ విషయాన్ని తనకు పరిచయం ఉన్న దుర్గా నగర్ తండాకు చెందిన భానోత వంశీ, గుగులోతు విష్ణు లకు తెలియజేయగా వారు డబ్బులు ఇస్తే ప్రశాంత్ తో పాటుగా వస్తామని చెప్పగా వారికి 60 వేల రూపాయలు ఇస్తాను ఒప్పందం చేసుకున్నారు .అనుకున్న ప్రకారం సమయం కోసం ఎదురుచూస్తుండగా ఎలక్షన్ సమయం రావడంతో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రసాద్ ని చంపాలి అనుకున్నాడు. ప్రసాద్ ప్రతిరోజు ప్రశాంత్ కి ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని సతాయించాడు. అనుకున్న విధంగానే గత నెల 29వ తారీఖున మాకూరుకి ప్రసాద్ వచ్చి ప్రశాంత్ ను కలిసి తనకు ఈరోజు ఎలాగైనా డబ్బులు ఇవ్వాలని అడగగా ఇదే సరైన సమయం అని ప్రశాంత్ అదే విషయాన్ని వంశీ విష్ణు లో చెప్పగా అదే రోజు నలుగురు కలిసి నిజాంబాద్ వెళ్లి అక్కడ ఒక కారును రోజు వారి వద్దకు తీసుకొని నలుగురు కలిసి అదే కార్లో తిరిగి సాయంత్రానికి మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతానికి వెళ్లి వారితో తెచ్చుకున్న మధ్యాన్ని ప్రసాద్ కి తాగించిన తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురు కలిసి ప్రసాద్ ని కట్టేతో రాళ్లతో కొట్టి చంపేసి అక్కడే చెట్ల సందులో పడేసి రాత్రి తర్వాత ఊర్లోకి వెళ్లి పార గడ్డపార తీసుకువచ్చి అక్కడే అడవిలో గోతితవ్వి పాతిపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ప్రసాద్ కనపడని విషయం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారని అనుకొని డిసెంబర్ 01 తారీఖున పాల్వంచ గ్రామానికి ప్రశాంత్ ఒకటే కార్లు వచ్చి ప్రసాద్ ఊర్లో అయినా కేసు విషయంలో పోలీసులు అతని గురించి తిరుగుతున్నందున ఒక దగ్గర దాక్కొని ఉన్నాడని ప్రశాంత్ భార్య అయిన శాన్విక మరియు చెల్లెలు శ్రావణి తన వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్ళాడు. నిజామాబాదులో శ్రావణిని ఒక స్థలంలో ఉంచి శాన్వికును భర్త దగ్గరకు తీసుకెళ్తారని నమ్మబలికి ముగ్గురు కలిసి శాన్వికును తీసుకొని బాసర బ్రిడ్జి వైపు వెళ్లి మార్గమధ్యంలో అనుకున్న ప్రకారం శ్రాన్విక గొంతుకి తాడుతో బిగించి చంపేసి బాసర బ్రిడ్జి పై నుండి నీళ్లలో పడవేసినారు. ఆ తర్వాత తిరిగి శ్రావణి ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ శ్రావణితో శ్రామికను ప్రసాద్ దగ్గర వదిలినామని చెప్పి ఇక్కడ నుండి వెళ్దామని ఆమెను తీసుకొని ముగ్గురు కలిసి కారులో ఆమెని అనుకున్న విధంగానే ఆమెను తాడుతో గొంతు బిగించి చంపేసి చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఎన్ హెచ్ 44 రోడ్డు ప్రక్కన తీసుకువెళ్లి వారితో తెచ్చుకున్న పెట్రోల్ ని ఆమెపై పోసి తగులపెట్టి ఏమి తెలియనట్టుగా అక్కడి నుండి మాక్లూరు వెళ్లారు. ప్రసాద్ వాళ్ళ అమ్మ సుశీల అతని పిల్లలు చైత్రిక , చైత్రీకులు మరియు ఇంకో చెల్లెలు స్వప్నాలు పాల్వంచలో ఉంటే ఇక్కడ ఉంటే పోలీసు వారు వచ్చి పాత కేసు విషయంలో తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పి అంతేగాక ప్రసాద్ మరియు మిగతావారు నిజాంబాద్ లో ఉన్నారని సుశీలతో చెప్పి అందరిని కూడా కారులో నిజాంబాద్ తీసుకువెళ్లి అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అన్నపూర్ణ లాడ్జిలో ఉంచినాడు.

అంతకుముందే ప్రశాంత్ తన తల్లి అయినా వడ్డెమ్మని ఆమెకి జరిగిన విషయం చెప్పి తనకు సహకరించాల్సిందిగా కోరి అందుకు ఆమె కూడా సరైనని ఒప్పుకొని నిజాంబాద్ లో ఉన్న అన్నపూర్ణ లాడ్జికి వచ్చింది. తేదీ 4 డిసెంబర్ నాడు ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడు అని చెప్పి సుశీలను మరియు స్వప్న లాడ్జిలోనే ఉంచి వారికి కాపలాగా వడ్డేమ్మని అక్కడే ఉంచి ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రశాంత్ మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి కారులో నిజాంబాద్ నుండి సోన్ బ్రిడ్జి దగ్గర కారు ఆపి పక్కనే రెండు గోనెసంచులు తీసుకొని వాటిలో శవాలను కట్టిపెట్టి బ్రిడ్జి పై నుండి ఇద్దరు పిల్లల శవాలను నీళ్లలో పడవేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత లాడ్జిలో ఉన్న సుశీలతో ప్రసాద్ అతని భార్య పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారని వాళ్ళ దగ్గరికి మనం తర్వాత వెళ్దామని చెప్పి సుశీలను మరియు ఆమె కూతురు స్వప్నలను లాడ్జిలోనే ఉంచి వారితో వడ్డెమ్మ నువ్వు అనుమానం రాకుండా ఉంచినాడు. తేదీ 13 డిసెంబర్ నాడు ప్రశాంత్ వంశీ లాడ్జ్ లో ఉన్న స్వప్నను తీసుకొని అదే కారులోఎక్కించుకొని అక్కడి నుండి కామారెడ్డి వైపు వస్తూ గాంధారి ఎక్స్ రోడ్ దగ్గర రైట్ కు తీసుకొని గాంధారి వైపు వెళుతూ బొంపల్లి గ్రామ శివారులో స్వప్న గొంతుకు తాడు బిగించి ఆమెను చంపేసి రోడ్డు పక్కన గుంత దగ్గర పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. లాడ్జిలో ఉన్న సుశీలకు మాయమాటలు చెప్పి ఆమెని లాడ్జిలో నుండి ఎక్కడికి పోకుండా మిగతా వారంతా కూడా క్షేమంగా ఉన్నట్లు చెప్పి ఆమెను కూడా చంపితే ఆ కుటుంబంలో ఎవరు కూడా ఉండరని ఆ తర్వాత ఆస్తి గురించి గానీ డబ్బుల గురించి గానీ అడిగే వారు ఉండరని అనుకున్నాడు.

కాగా సుశీల వారి వద్ద నుండి తప్పించుకొని బయటకి పోగా, మంగళవారం ఉదయం ప్రశాంత్, వంశీ, విష్ణు, బాయ్ జీవనిల్ ,మరియు వడ్డెమ్మలు కారులో పాల్వంచలో సుశీల ఉండవచ్చని కారణంతో పాల్వంచకి వస్తుండగా గాంధారి ఎక్స్ రోడ్లో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా , నిందితులు పూర్తి సమాచారం బయట పెట్టారు. ఉదయం పైన తెలిపిన అందర్నీ అరెస్టు చేసి సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్ వివరాలు ; 249/2023, యూఎస్ 302, 364, 201, 379, ఆర్ బై డబ్ల్యూ 109 ఐపిసి సెక్షన్ లో రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ సింధు శర్మ వివరించారు. నేరస్తులను కస్టడీలోకి తీసుకున్న సమయంలో టాటా ఆల్ ట్రోజ్ కార్ నెంబర్ టిఎస్ 16 ఎఫ్ కే 2680, ఒక బైక్, ల్యాండ్ రిజిస్టర్ డాక్యుమెంట్స్, 30 వేల రూపాయలు, ఐదు సెల్ ఫోన్లు, ఒక త్రాడు, పెట్రోల్ బాటిల్ రెండు, ఒక బంగారు పూస్తే, ఒక పారా, గడ్డపార, ఒక రోల్డ్ గోల్డ్ నల్లపూసల దండ రికవరీలో దొరికాయి. ఈ కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రామన్, సదాశివ నగర్ ఎస్సై రాజు, మరియు వారి సిబ్బంది హెచ్ సి అశోక్, ఎస్కే సయ్యద్, జానకిరామ్, ఇర్ఫాన్, రవికుమార్, అబ్దుల్, హమీద్, శశికాంత్, నరేష్, సుధాకర్ రెడ్డి, అరుణ్, సి సి ఎస్ పి సి ఎస్ రవి, రాజేందర్, వీళ్లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి, డిఎస్పీ లు, సిఐలు,ఎస్సైలు, ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్లు పాల్గొన్నారు.

Share this Article