భారత శక్తి ప్రతినిధి) రంగారెడ్డి జిల్లా జూన్ 24: బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ 8V రోడ్ మరియు NGO’s కాలనీ లేబర్ అడ్డ వద్ద డ్రైనేజీ పైప్ లైన్ పగిలిపోయి రోడ్లపై మురుగునీరు చేరి వాహనదారులకు మరియు పాదాచారులకు ఇబ్బందికరంగా ఉందని కాలనీవాసులు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన కార్పొరేటర్ వెంటనే సంబంధిత జలమండలి అధికారి భవ్య రెడ్డి కి సమాచారం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజ్ పైప్ లైన్ ను వెంటనే బాగు చేయాలని, డ్రైనేజీ మురుగునీరు రోడ్లపై రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి సూచనలు ఇవ్వడం జరిగింది మరియు పారిశుద్ధ కార్మికులకు కాలనీలో చెత్త చెదారాలు లేకుండా నిత్యం శుభ్రపరచుకునే బాధ్యత తమపై ఉందని కావున ప్రతి రోడ్డు శుభ్రపరిచేలా చూసుకోవాలని అన్నారు మరియు డివిజన్ పరిధిలోని ఏ కాలనీలోనైనా సరే సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.