సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి)
సూర్యాపేట జిల్లాలో చాలా కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడుతున్నాయని నాణ్యమైన దర్యాప్తు చేస్తూ త్వరితగతిన నేర అభియోగ పత్రాలను కోర్టులకు అందిస్తున్నామని శిక్షల శాతం పెరిగిందని అందుకు కృషి చేసిన సిబ్బందిని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు.ఈసందర్భంగా నేరేడుచర్ల, మోతే పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన పోక్సో చట్టం కేసుల్లో గతంలో ఇద్దరు నేరస్తులకు జీవితఖైదు శిక్షలు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినదని, జీవితఖైదు ఉత్తర్వులు అమలైయ్యేలా పని చేసిన కోర్టు కానిస్టేబుల్ లకు, భరోసా సెంటర్ సిబ్బందికి డిజిపి కార్యాలయం మహిళా రక్షణ విభాగం వారు అందించిన ప్రశంసా పత్రాలను ఎస్పి బరోసా సెంటర్ మహిళ ఎస్సై మౌనిక, ఏఎస్ఐ సైదాబి, నెరేడుచర్ల పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రవీందర్, మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లింగయ్య లకు అందించారు