లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) భాగంగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) సీనియర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్(Steven Smith).. టీమిండియా (Teamindia) హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వేసిన 42వ ఓవర్లో బౌండరీ బాదడం ద్వారా టెస్ట్ క్రికెట్‌లో స్టీవెన్ స్మిత్ 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 9 వేల పరుగులను పూర్తి చేసిన రెండో ఆటగాడిగా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తరఫున మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.
కాగా స్మిత్ 174 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో 176 ఇన్నింగ్స్‌ల్లో 9 వేల పరుగులు పూర్తి టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. కాగా 172 ఇన్నింగ్స్‌ల్లోనే 9 వేల పరుగులను పూర్తి చేసిన శ్రీలంక (Sri lanka) మాజీ ఆటగాడు కుమార సంగక్కర (Kumar Sangakkara) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా స్టీవెన్ స్మిత్ తన 99వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకోవడం గమనార్హం.ఈ ఇన్నింగ్స్‌లో స్మిత్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 15,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా 15 వేల పరుగులను పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడో స్థానంలో నిలిచాడు. కాగా స్మిత్ 351 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 9054 పరుగులు చేసిన స్మిత్, వన్డేల్లో 4,939.. టీ20ల్లో 1008 పరుగులు చేశారు. కాగా 333 ఇన్నింగ్స్‌ల్లోనే 15 వేల పరుగులు పూర్తి చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.