Bharatha Sakthi

మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు

Bharath Sakthi 04/07/2023
Updated 2023/07/04 at 7:52 PM

కడప, జూలై 4 : మాదకద్రవ్యాలైన గంజాయి, మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

తాడేపల్లి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి.. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి.. జిల్లా.కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు ఎస్పీ అన్బు రాజన్, జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్ సంబందిత అధికారులు పాల్గొన్నారు.

** ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను యువతకు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు వద్ద – అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు సంబంధించి చేపట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పిలకు పలు సూచనలు చేశారు.

** సీఎస్ విసి ముగిసిన అనంతరం.. జిల్లా కలెక్టర్ సంబందిత ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అధికారులతో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పటిష్టమైన నిఘా చర్యలు అవలంబించాలని తెలిపారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. మాదకద్రవ్యాలు విక్రయాలు జరిగే చోట గట్టి నిఘా ఉంచాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు. బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పునరావాసం కల్పించాలని అన్నారు.

మత్తు పదార్థాల సరఫరాపై సమాచారం అందించేందుకు ప్రభుత్వ టోల్ ఫ్రీ నెం.15400 ను విద్యాసంస్థలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు ద్వారా దీనిపై నిఘా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అక్రమార్కులు గంజాయి సాగు చేపట్టకుండా జిల్లా అటవీశాఖాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రత్యక్షంగా అవసరమని, వారి పిల్లల ప్రవర్తనను నిత్యం గమనించుకుంటూ ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

Share this Article