Bharatha Sakthi

ఫ్రీ బీలపై సుప్రీం సీరియస్‌

admin 07/10/2023
Updated 2023/10/07 at 7:54 AM

న్యూఢల్లీి, అక్టోబరు 7
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగనున్న వేళ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్‌ దాఖలైంది. ఓటర్లకు నగదు, ఉచిత కానుకలు పంచకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల వేళ మరోసారి ఉచితపథకాలపై దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆదాయం లేకపోయినా అప్పులు చేసి మరీ ప్రభుత్వాలు డబ్బులు పంచుకుంటూ పోతున్నాయని వెంటనే కట్టడి చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇప్పటికే రాష్ట్రాలు అప్పలపాలవుతున్నాయని.. అయినా ఓట్ల కొనేందుకు ట్యాక్స్‌ పేయర్స్‌ డబ్బు వాడుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం.. సమాధానం చెప్పాలంటూ రెండు రాష్ట్రాలకు, కేంద్రానికి అటు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలోనూ పార్టీలు హావిూలు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఉచిత పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి ప్రధానపార్టీలు.ఉచితాలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పన్ను చెల్లింపుదారుల ధనాన్ని ఇలా కానుకలుగా పంచడం సబబుకాదని న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు, కానుకల పంపిణీ మొదలువుతుందనే విషయాన్ని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.ఎన్నికల సమయంలో ఇచ్చే ఓటర్లకు రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆజ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏః పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు ? కేంద్రం, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులను ప్రతివాదులుగా చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలైంది. కాని, ముఖ్యమంత్రులను తొలగించి ఆ రాష్ట్రాల పేర్లు చేర్చాలని సుప్రీంకోర్టు సూచించిందిఈ తరహా పిటిషన్‌లో గతంలో కూడా సుప్రీంకోర్టులో దాఖలైంది. బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ చేసింది. గతంలో ఉన్న పిటిషన్‌ను ప్రస్తుతం దాఖలైన పిటిషన్‌ను రెండిరటిని కలిపి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *