గుడివాడ, డిసెంబర్ 6
కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌గా వెనిగండ్ల రామును నియమించిన సంగతి తెలిసిందే. అయితే రాము నియామకం వెనక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఎన్నారై రాము నియమితులయ్యారు. రావిని మార్చడంపై కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్‌తోనే మార్పుచేసినట్లు తెలుస్తోంది. రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో తన అనుచరులతో కలిసి పర్యటించారు. పర్యటనలో తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా ప్రదర్శించారు. దీనిపై అప్పుడే సోషల్ విూడియాలో పెద్ద చర్చ జరిగింది. పార్టీ అనుమతి లేకుండా వెంకటేశ్వరరావు గాంధీకి ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. అనే విషయమై రావి వెంకటేశ్వరరావు స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా రామును ఇన్ ఛార్జిగా నియమించడంతో ఆయన అధిష్టానానికి చెప్పకుండానే ప్రచారంలో పాల్గొన్నట్లు స్పష్టమైంది. అరికెపూడి గాంధీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది తర్వాత బీఆర్‌ఎస్ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. గాంధీకి రావి ప్రచారంపై నాలుగురోజులు సోషల్ విూడియాలో పెద్ద దుమారం రేగింది. 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీచేసిన రావి వెంకటేశ్వరరావు కొడాలి నాని చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Leave a comment