Bharatha Sakthi

తహశీల్దార్ వజ్రాల జయశ్రీ అరెస్ట్

Bharath Sakthi 11/10/2024
Updated 2024/10/11 at 7:25 PM

14 రోజులు జ్యూడిషల్ రిమాండ్ విధించిన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్

హుజూర్ నగర్ సబ్ జైలు కు తరలింపు

సూర్యాపేట జిల్లా బ్యూరో భారత శక్తి అక్టోబర్ 11

హుజూర్ నగర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వహించిన వత్సవాయి జగదీష్ బూరుగడ్డ గ్రామములోని సర్వే నెంబర్ 439/55/5 నందు 8.38 ఎకరాలు, సర్వే నెంబర్ 604/116 నందు 7.32 ఎకరాలు పచ్చిపాల ప్రియాంక పేరున 604 /58 లో 4.38 ఎకరాలు మడిపల్లి స్వప్న సోదరి పేరు మీద హుజూర్ నగర్ పట్టణం లోని 602/122/1 లో 0.01,608/16 లో 8.0 ఎకరాలు, 10 41/144 లో 6.25, 1041/368/3/2/5 0.10 వత్సవాయి ఇందిరా తల్లి పేరు మీద మొత్తం 36.2301ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఐఎల్ఎంఆర్ఎస్ పోర్టల్ లో వత్సవాయి జగదీష్ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ నవంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 మధ్య కాలంలో నమోదు చేసుకోగా అట్టి భూములను ఎలాంటి అసైన్మెంట్ కమిటీ తీర్మానాలు లేకుండా ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహశీల్దార్ గా పనిచేస్తున్న వజ్రాల జయశ్రీ గతంలో ఆమోదించడంతో నాటినుండి నేటి వరకు ప్రభుత్వ ధనాన్ని (రైతు బంధు) పొందుతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జగదీష్ ను ధరణి ఆపరేటర్ గా శాశ్వతంగా తొలగించగా ప్రస్తుత తహసీల్దార్ నాగేందర్ హుజూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ నెంబర్ 226/2024 తేదీ 21.09.2024 కేసు నమోదు చేసి బుధవారం ధరణి ఆపరేటర్ జగదీష్ ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, అన్ని కోణాలలో విచారణ జరిపిన పోలీసులు తహశీల్దార్ వజ్రాల జయశ్రీ పై 420,406,409,పలు ఐపిసి సెక్షన్లు క్రింద కేసు నమోదు చేసిఅరెస్టు చేసి జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్ ఎదుట హాజరు పరచగా 14 రోజులు జ్యూడిషల్ రిమాండ్ విధించడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు తహశీల్దార్ వజ్రాల జయశ్రీ ని హుజూర్ నగర్ సబ్ జైలు కు తరలించారు.

Share this Article