Bharatha Sakthi

కేసీఆర్ ఫాంహౌస్‌లో.. కేటీఆర్ ట్విట్టర్‌లో..

admin 09/06/2022
Updated 2022/06/09 at 3:26 AM

రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు స్థానం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరని.. శాంతి భద్రతలు గాలిలో కలిశాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. అఘాయిత్యాలను నిరోధించడంలో, శాంతి భద్రతలను కాపాడటంలో, పరిపాలనా నిర్వహణలో.. ఇలా అన్నింట్లో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో నిందితులను తప్పించేందుకు రాష్ట్ర సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నిందితులకు పోలీసులే కొమ్ముకాస్తున్నారని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో బీజేపీ ఆందోళన మొదలుపెట్టిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణలో నేరాలు పెరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేసీఆర్ పూర్తిగా కుటుంబ రాజకీయాల్లో మునిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారడం బాధాకరమన్నారు.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నందున, బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కేసీఆర్ సెక్రటేరియట్కు వెళ్లకుండా ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. ఆయన కొడుకు కేటీఆర్ ట్విట్టర్లో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఇక హోంమంత్రి అసలు ఉన్నారా? లేరా అనేది తెలియని పరిస్థితి అని మండిపడ్డారు. కేసీఆర్ తన పర్సనాలిటీని దేశవ్యాప్తంగా బిల్డప్ చేసుకోవడానికి సర్కారు ఖజానా నుంచి రూ.109 కోట్లు ఖర్చు చేసి దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలిచ్చారు. పేదల సొమ్మును వ్యక్తిగత ఇమేజీ కోసం దుర్వినియోగం చేసే హక్కు కేసీఆర్కు ఎవరిచ్చారని తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *