Bharatha Sakthi

తెలంగాణ కెనడా సంఘం (టి సి ఎ ), టొరంటో లో అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ వేడుకలు

(కెనడా నుండి భారత శక్తి ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణ కెనడా అసోసియేషన్ (టి సి ఎ ) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ ధామ్ పేరుతో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1800 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ ఏర్ర గారు ప్రారంభించగా , శ్రీమతి స్వాతి మన్నెం గారు, శ్రీమతి అమృత దీప్తి కర్రి గారు, శ్రీమతి కవిత తిరునగరి గారు, శ్రీమతి ప్రసన్న మేకల గారు మరియు శ్రీమతి స్ఫూర్తి కొప్పు గారు జ్యోతి ప్రజ్వలన చేయగా కుమారి శ్రీ ఐక్య ఏర్ర గణేష వందనంతో ధూమ్ ధామ్ 2024 సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ ఏర్ర గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల గారు మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా గారు వేదిక పై పాల్గొన్నారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతముగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు, రచయిత మరియు దర్శకుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు తెలంగాణ ప్రాముఖ్యతని మరియు అభివృద్ధిని కొనియాడుతూ, తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసించు తెలంగాణవాసులకు మరియు సంస్థ శ్రేయోభిలాషులకు వాట్సాప్ ఫోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ధూమ్ ధామ్ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు గారి సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు మరియు కుమారి ప్రహళిక మ్యాకల గారు నాలుగు గంటల పాటు వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాలలో కూచిపూడి నృత్యాలయం వారిచే ప్రదర్శించబడిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురుం, గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దం మరియు మరోవేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల విశేష జనాదరణ లభించినది. అనంతరం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ టి సి ఎ ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టి సి ఎ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ ఫుల్ గా ఆర్గనైజ్ చెయ్యడం పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టి సి ఎ లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టి సి ఎ తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు , ఉపాధ్యక్షుడు శ్రీ మనోజ్ రెడ్డి గారు , సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు గారు , సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ ఏర్ర గారు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల గారు , కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ల గారు , సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని గారు , డైరెక్టర్లు – శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి గారు , శ్రీ నాగేశ్వరరావు దలువాయి గారు , శ్రీ ప్రణీత్ పాలడుగు గారు , శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, శ్రీ భగీరథ దాస్ అర్గుల గారు మరియు శ్రీ ప్రవీణ్ కుమార్ సామల గారు , ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – శ్రీమతి ప్రసన్న మేకల గారు మరియు శ్రీ మురళీధర్ కందివనం గారు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా గారు, వ్యవస్థాపక సభ్యులు – శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి గారు, శ్రీ హరి రావుల్ గారు, శ్రీ శ్రీనివాస తిరునగరి గారు, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల గారు, శ్రీ అఖిలేష్ బెజ్జంకి గారు, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్ గారు, శ్రీ రాజేశ్వర్ ఈధ గారు, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల గారు, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం గారు, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి గారు మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. చివరగా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారి కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగించారు.

Gallery