తిరుపతి
తిరపతి నగరంలో మరో బాలుడు అదృశ్యమయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని ఫ్లాట్ ఫారం `3 వద్ద ఘటన జరిగింది. బాలుడి కుటుంబికులు తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై బస్ స్టాప్ వద్ద సేదతీరుతున్నప్పుడు ఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు, రెండున్నర గంటల మధ్య బాలుడు తప్పిపోయినట్లు గుర్తించారు. చెన్నై, వరసవక్కం ప్రాంతానికి ,కు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్ (2) గా గుర్తించారు. బస్టాండ్ సవిూపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సిసి పుటేజ్ లో రికార్డ్ అయింది. బాలుడి బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో ఈస్ట్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
Leave a comment