బెంగళూరు, అక్టోబరు 6
బెంగళూరులో ఓ బస్ స్టాప్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అవును. కన్నింగమ్ రోడ్‌లో మెట్రోపాలిటిన్ మెయింటేన్ చేస్తున్న బస్ షెల్టర్ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. రూ.10 లక్షల విలువైన షెల్టర్ దొంగలపాలైనట్టు పోలీసులు గుర్తించారు. బీఎంటీసీ కోసం బస్ షెల్టర్‌లు తయారు చేసే కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సెప్టెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఆ షెల్టర్ చోరీకి గురై నెల రోజులైంది. అంతకు ముందు మార్చి నెలలో లేఅవుట్‌లోని బస్ స్టాండ్ ఉన్నట్టుండి మాయమైంది. దాదాపు 30 ఏళ్లుగా ఉన్న ఈ బస్ స్టాండ్ ఉన్నట్టుండి మాయమైపోవడం షాక్‌కి గురి చేసింది. 1990లో లయన్స్ క్లబ్ వాళ్లు దీన్ని డొనేట్ చేశారు. ఆ తరవాత దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. షాప్‌లు నిర్మించేందుకు అడ్డుగా ఉన్న బస్‌స్టాండ్‌ని రాత్రికి రాత్రే తొలగించినట్టు వెల్లడిరచారు. కన్నింగమ్ రోడ్‌లోనూ ఇలాగే కనిపించకుండా పోతే…అధికారులే చేసి ఉంటారని అంతా భావించారు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ…నెల రోజుల తరవాత అసలు నిజం బయటకు వచ్చింది. దొంగలు ఎత్తుకెళ్లిపోయారని తెలిసింది. నిజానికి ఇలా బస్ స్టాప్‌లు మాయం అవడం బెంగళూరులో కొత్తేవిూ కాదు. 2015లో దూపనహళ్లి బస్ స్టాప్ కనిపించకుండా పోయింది. అంతకు ముందు 2014లోనూ 20 ఏళ్లుగా ఉన్న బస్‌స్టాప్ మాయమైంది. ఇలా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
Leave a comment