Bharatha Sakthi

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మంత్రి

admin 07/08/2022
Updated 2022/08/07 at 6:45 AM

ఆగష్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 22 వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే వేడుకలను జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ ఉత్సవాల రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ చైర్మన్ లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మంత్రి సమావేశ అయ్యారు.వారికి కార్యక్రమల వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పటిష్ట ప్రణాళికతో చేపట్టి విజయవంతం చేయాలని ఆదేశించారు.8వ తేదీన స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం ’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, 9వ తేదీన ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం జరపాలని చెప్పారు.
ఆగస్టు 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు చేయాలని, ఆగస్టు 11న ఫ్రీడం రన్ నిర్వహించాలన్నారు.
ఆగస్టు 12 న రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి చేయాలని చెప్పారు. ఆగస్టు 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 14న సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు యధావిధిగా నిర్వహించాలని చెప్పారు. ఆగస్టు 16న ఏకకాలంలో, ఎక్కడివారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సమూహిక జాతీయ గీతాలాపనలు చేయాలన్నారు. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహించాలన్నారు.
ఆగస్టు 17 న రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆగస్టు 18 న ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ, ఆగస్టు 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లల్లో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ చేయాలని మంత్రి వివరించారు. ఆగస్టు 20న దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు చేపట్టాలని చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయంతం చేయాలని, ఆయా సంభందిత అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.ఆగస్టు 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పాల్గొంటానని అన్నారు.ఆగస్టు 22 న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగుతాయని మంత్రి వివరించారు.ఆయా కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కలిసి కట్టుగా పాల్గొనాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ , అదనపు కలెక్టర్లు స్నేహ లత , మధు సుధన్ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్.జెడ్పీ సిఈ వో అప్పారావ్ , డిఆర్ డీఏ పిడి విద్యాచందన , అదనపు డిసిపి శబరీష్ , మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్ లు అధికారులు ఉన్నారు.

Share this Article