సూర్యపేట జిల్లా మేళ్లచెరువు గ్రామపంచాయతీ లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మేళ్లచెరువు గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ ఫిర్యాదు చేయడంతో సూర్యపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారులు కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ డి ఎల్ పి ఓ శ్రీధర్ స్పెషల్ ఆఫీసర్ సందీప్ నల్లగొండ డిపిఓ సామి రెడ్డి శుక్రవారం మేళ్లచెరువు గ్రామపంచాయతీని ఆకస్మిక తనిఖి చేశారు అనంతరం కార్యాలయంలో 2004 నుండి 2023 వరకు రికార్డులను పరిశీలించి వాటిని సీజ్ చేసి స్వాధీనం చేసుకొని పలు రికార్డులను వారి వెంట తీసుకువెళ్లారు