Bharatha Sakthi

చిరు సరసన త్రిష..?

admin 06/12/2023
Updated 2023/12/06 at 6:50 AM

చిరంజీవి – త్రిష.. ఇద్దరూ కలసి ‘స్టాలిన్‌’లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఈ జోడీని మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసే అవకాశం రాలేదు. ఇంత కాలానికి వీరిద్దరూ జంటగా దర్శనమివ్వబోతున్నారని టాక్‌. చిరంజీవి – వశిష్ట కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు సరసన ఐదుగురు కథానాయికలు కనిపించబోతున్నారు. అందులో ఓ కథానాయికగా త్రిష ఎంపిక ఖాయమైందని సమాచారం. నిజానికి త్రిష పాత్రలో ముందుగా అనుష్క పేరు పరిశీలించారు. చివరికి త్రిషని ఫైనల్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష దేవకన్యగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ తరహా పాత్ర త్రిష ఇంత వరకూ చేయలేదు. అందుకే కథ విన్న వెంటనే ‘ఓకే’ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో నలుగురు కథానాయికలు ఎవరన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే పేరు పరిశీలిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *