Bharatha Sakthi

మహిళను హత్య చేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు

Bharath Sakthi 28/02/2024
Updated 2024/02/28 at 7:24 PM

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 28 (భారత శక్తి): మహిళను హత్య చేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదును విధిస్తూ గౌరవ కొత్తగూడెం జిల్లా ప్రధాన జడ్జి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన కళ్యాణి అనే మహిళను 2019వ సంవత్సరం జనవరి 6వ తేదీన హత్యకు గురైనట్లుగా గుర్తించిన చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దిష్టిబొమ్మలు విక్రయించడానికి చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చిన పెండ్రాల ఐలయ్య అతని తండ్రి కోటయ్య మరియు కళ్యాణి ల మధ్య తగాదా రావడంతో ఐలయ్య అతను తండ్రి కోటయ్య కలిసి కళ్యాణిని హత్య చేసి గుంటూరు పారిపోయినట్లుగా నిర్దారణ అయ్యింది. ఈ మేరకు అన్ని సాక్ష్యాదారాలతో కోర్టులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసినారు. కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి ప్రాసిక్యూషన్ తరపున 17 మంది సాక్షులను విచారించి నిందితులపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జీవిత ఖైదును విధించారు. మహిళను హత్య చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి మీరా ఫిర్దోష్, కోర్టు లైజన్ అధికారి వీరబాబు, హెడ్ కానిస్టేబుల్ లచ్చు, కానిస్టేబుల్ రామకృష్ణలను బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అదే విధంగా కేసు పురోగతిని తుది వరకూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సాక్షులను ధైర్యంగా కోర్టులో హాజరయ్యేలా వ్యవహరించిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, చుంచుపల్లి ఎస్సై ప్రవీణ్ లను కూడా ఈ సందర్బంగా ఎస్పీ అభినందించారు.

Share this Article