హైదరాబాద్, అక్టోబరు 4
కోరుకున్న జీవితం దక్కలేదనో, ప్రేమలో విఫలం అయినా, నచ్చిన జాబ్ రాకున్నా.. తల్లిదండ్రులు మందలించినా, పరీక్షలో ఫెయిల్ అయినా.. ఇలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో జరిగింది. ప్రియుడి మరణవార్త తట్టుకోలేక, అతడి లేని లోకంలో ఉండలేనంటూ ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లో ఈ విషాదం చోటుచేసుకుంది.గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో ఒక హాస్టల్ లో ఉంటూ బరిష్టా కేఫ్ లో పనిచేస్తోంది 19 ఏళ్ల యువతి నేహా. అదే కేఫ్ లో సహా ఉద్యోగి అయిన సల్మాన్ తో పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో శనివారం రోజు బాలాపూర్ వెంకటాపురం లోని తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సల్మాన్. పెళ్లికి పెద్దలు ఒప్పుకోపోవం, దాంతో ప్రియుడు సల్మాన్ మృతిని తట్టుకోలేకపోయింది నేహా. ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది నేహా. దాంతో వీరి ప్రేమ కథ మరీ విషాదంగా మారింది. చెల్లెలు నేహ ఆత్మహత్య గురించి అక్క మేఘ పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు నేహా మృతదేహాన్ని కిందకి దించి, పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Leave a comment