న్యూఢల్లీి, ఆగస్టు 23
జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తొంది. భారత్ నేతృత్వాన సెప్టెంబర్‌లో జీ20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌తో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ తెలిపారు. జీ20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ఇంకా వెల్లడిరచలేదు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్‌కి రావడం ఇదే తొలి సారి కావడం విశేషం. మరో వైపు 2026లో జీ20 సమ్మిట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక సెప్టెంబరులో ఇండోనేషియాలో జరిగే ఆసియన్ సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విడిగా హాజరవుతారని కూడా సల్లివన్ తెలిపారు. జీ20 సమ్మిట్‌లో బైడెన్ బ్యాంకుల ఆధునీకరణ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా చర్చిస్తారని సల్లివన్ వెల్లడిరచారుఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్ నేపథ్యంలో సెప్టెంబర్ 8`10 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం, న్యూఢల్లీి పోలీసులు జిల్లా పరిధిలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా అన్ని రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేయబడతాయి.
Leave a comment