Bharatha Sakthi

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్పయాత్ర

Bharath Sakthi 12/03/2024
Updated 2024/03/12 at 6:24 AM

చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి), ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరిశ్రమలకు ప్రేరణ కలిగించుచున్నారు.
గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద 400 తేనెటీగ పెట్టెలు, 200 ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు, 100 చింతపండు
పండ్ల ప్రాసెసింగ్ టూల్స్ మరియు 40 ఎలక్ట్రికల్ టూల్ కిట్‌లు, 40 ప్లంబర్ టూల్‌ కిట్‌లు, 20 పేపర్ ప్లేట్ / బౌల్
మేకింగ్ టూల్‌ కిట్‌ లను పంపిణీ చేశారు.

చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్(కె వి ఐ సి)వారు “వికసిత భారత్ సంకల్పయాత్ర” తో
సమలేఖనం చేస్తూ చేతివృత్తుల వారికి సాధికారత కల్పిస్తున్నారు.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మరియు భారతదేశాన్ని స్వావలంబన గా మార్చాలనే ఆయన విజన్ కు అనుగుణంగా శ్రీ. మనోజ్ కుమార్, గౌరవ చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి), ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, పర్యటన సందర్భంగా, తేనెటీగలతో కూడిన 400 తేనెటీగ పెట్టెలు, 200 ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు, 20 పేపర్ ప్లేట్ / బౌల్ మేకింగ్ టూల్‌ కిట్‌లు, 40 ఎలక్ట్రికల్ టూల్ కిట్‌లు, 40 ప్లంబర్ టూల్ కిట్‌లు, 100 చింతపండు ప్రాసెసింగ్ టూల్‌ కిట్‌లు, గ్రామోద్యోగ్ వికాస్ యోజన చేతివృత్తుల వారికి పంపిణీ చేయుట జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపూర్‌లోని ఎం.జీ.ఎం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ; గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క అత్యుత్తమ నాయకత్వంలో గత 9 సంవత్సరాలలో, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ (కె వి ఐ) రంగం టర్నోవర్ రూ. 1.34 లక్షల కోట్లు మరియు 9.50 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించిందని; అంకితభావం కలిగిన ఖాదీ కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని, ఈ విజయాన్ని “మోదీ కి గ్యారెంటీ”గా చెప్పవచ్చని, ఇది వారి శ్రేయస్సు పట్ల ప్రధానమంత్రికి ఉన్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని శ్రీ. మనోజ్ కుమార్ ఉద్ఘాటించారు.

శ్రీ. మనోజ్ కుమార్, గౌరవ చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ,మాట్లాడుతూ, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సెక్టార్, గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ పరిశ్రమలను కాపాడటం మరియు గిరిజనులు, కొండ ప్రాంతాలు, ముఖ్యంగా ఎస్ సి/ఎస్ టీ మరియు మహిళలతో సహా పేద, చేతివృత్తుల వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఖాదీ కళాకారుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం దృఢమైన అంకితభావంతో “వికసిత భారత్ అభియాన్ తో” జతచేయుట ద్వారా మెరుగైన జీవనోపాధి మరియు ఉపాధితో ఈ కళాకారులు గుర్తించదగిన మార్పు ను అనుభవిస్తున్నారని తెలియపరచినారు.

కెవిఐసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఖాదీ “ఆత్మనిర్భర్ భారత్”కు చిహ్నంగా మారిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలలో కూడా స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి విజన్లో కె వి ఐ సి నిరంతరం పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి), ఈ లక్ష్యాలను సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని. 2022-23 సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఖాదీ సంస్థలు రూ.47.58 కోట్ల ఉత్పత్తి మరియు రూ. 62.28 కోట్లు అమ్మకాలతో, 7942 మంది కళాకారులకు ఉపాధి కల్పించడం ద్వారా విశేషమైన వృద్ధిని సాధింఛాయని తెలియపరచినారు.

పి ఎం ఇ జి పి కింద 4015 మంది లబ్ధిదారులకు రూ.145.04 కోట్ల మార్జిన్ మనీ పంపిణీ జరిగిందని తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 32120 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు, మన ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కె వి ఐ సి స్వయం-స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు చురుకుగా సహకరిస్తోందని కె వి ఐ సి, గౌరవ చైర్మన్, శ్రీ మనోజ్ కుమార్ పేర్కొన్నారు.

ఖాదీ పట్ల గౌరవనీయులైన ప్రధానమంత్రి విజన్ కేవలం బట్టలు నేయుటకు మించి విస్తరించిందని, స్థానిక కళాకారులు మరియు పారిశ్రామికవేత్తలకు స్వావలంబన యొక్క భవిష్యత్తును నేయాలని ఆయన హైలైట్ చేశారు. పి ఎం ఇ జి పి, ఎం ఎం డీ ఏ, కె అర్ డీ పి, వర్క్ షెడ్ కార్యక్రమాల
ద్వారా; ఖాదీ కేవలం అభివృద్ధి చెందడమే కాదు, దేశవ్యాప్తంగా గణనీయమైన ఉపాధిని మరియు ఆర్థిక సాధికారతను సృష్టిస్తోందని. ఖాదీని ప్రపంచీకరించడానికి, ఈ జాతీయ గౌరవ చిహ్నం రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుందని కె వి ఐ సి యొక్క నిబద్ధత నిర్ధారిస్తుందని తన ముగింపు వ్యాఖ్యలలో శ్రీ మనోజ్ కుమార్ పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా, కె వి ఐ సి యొక్క గౌరవనీయ ఛైర్మన్, శ్రీ మనోజ్ కుమార్, హిందూపూర్ రైల్వే కమ్యూనిటీ హాల్‌లో పి ఎం ఈ జి పి ఆధ్వర్యంలో 10-రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఖాదీ బజార్ 2024 ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో, ఖాదీ కళాకారుల జీవనోపాధిని పెంచడానికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఖాదీ సంస్థల ప్రతినిధులు, సంప్రదాయ రీలర్లు & నేత కార్మికులతో సంభాషించారు. ఈ రెండు కార్యక్రమాలకు ఖాదీ యొక్క పరివర్తన సామర్థ్యానికి నిదర్శనంగా పనిచేసిన కళాకారులతో పాటు కె వి ఐ సి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

Share this Article