పెద్దమునగాల గ్రామస్తులు మినరల్ వాటర్ ప్లాంట్ ని ఉపయోగించుకోని శుద్ద జలంతో ఆరోగ్యవంతులుగా ఉండాలని గ్రామ సర్పంచ్ పరికపల్లి శ్రీనివాసరావు అన్నారు.నిన్న కొణిజర్ల మండలం పెద్ద మునగాల పంచాయతీ లో నీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకి మంచి నీరు అందించాలని కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం వుంది గనుక ప్రజలకి మంచి జరగాలని ఉద్దేశం తో నీటి శుద్దీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాము బాలవికస్ సభ్యులు బాల మోహన్ రెడ్డి ప్రసాద్ దాతలు కోడుమూరు సీతారాములు కోడుమూరు లక్ష్మణ మూర్తి కంచు బిరయ్యు తలారి ప్రేమ్ చంద్ దాడే శ్రీను వీరబాబు మరీకంటి ఎల్లయ్య సోల పెద్ద శ్రీనివాసరావు కవిడ కృష్ణ పసుపులేటి శ్రీను బాలరాజు గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.