వరంగల్ బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 29:
వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, హనుమకొండ జిల్లా సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీ.వి. భానుప్రసాద్ భారత శక్తి దినపత్రిక క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి ప్రావిణ్య ఆవిష్కరించగా, హనుమకొండ జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ జీ.వీ.భాను ప్రసాద్ లు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిలా పత్రికలు ఉండాలని, ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో దుబాసి రవిందర్ బృందానికి ఇరువురు శుభాకాంక్షలు తెలిపారు.