దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanathara) కొంతమంది విద్యార్థినిలను సర్‌ప్రైజ్ చేశారు. వారికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. వారితో సరదాగా మాట్లాడడమే కాదు.. స్వయంగా బిర్యానీ వడ్డించి సరదగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తను నటించిన ఏ సినిమా ప్రచారానికైనా దూరంగా ఉండే నయనతార ఇప్పుడిలా చేయడం విశేషంగా ఉంది. తాజాగా నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూరణి’. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ఉపశీర్షిక. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా ఈ నెల 1 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అన్నపూరణి’ నయనతార నటించిన 75వ చిత్రం. ఇందులో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి.. ఇండియన్ బెస్ట్ చెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందనేది ఈ సినిమా కథాంశం.
సినిమాకు చక్కని స్పందన వస్తోన్న సందర్బంగా ఈ హీరో, హీరోయిన్లు చెన్నైలోని ఓ లేడీస్ కాలేజ్‌ను సందర్శించారు. లంచ్ టైమ్‌కి వెళ్లి వారితో ముచ్చటించి, బిర్యానీ వడ్డించారు. అభిమాన తారను చూడగానే ఆ స్టూడెంట్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది నయన నటించిన జవాన చిత్రం సెప్టెంబర్‌లో విడుదలై ఎంతగా అలరించిందో తెలిసిందే! ప్రస్తుతం ఆమె ‘టెస్ట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. మాధవన్, సిద్థార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.