Bharatha Sakthi

అవినాష్‌ అరెస్ట్‌ కు ఎందుకు బ్రేకులు

admin 17/10/2023
Updated 2023/10/17 at 9:11 AM

కడప, అక్టోబరు 17
వైఎస్‌ వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించామంటున్నారు … ఛార్జిషీట్లు దాఖలు చేశారు.. అయినా పోలీసులు మాత్రం కడప ఎంపీఅవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేయడం లేదు… ఒక మాజీ మంత్రి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ అరెస్టు కాకపోవడానికి కారణమేంటి?… ఆయన తండ్రి జైల్లో ఉన్నా.. సదరు ఎంపీ మాత్రం ఎందుకు అరెస్ట్‌ కావడం లేదు?…చంద్రబాబుని అరెస్ట్‌ చేయడానికి చకచకా చర్యలు చేపట్టిన జగన్‌ సర్కారు… సొంత ఎంపీ విషయంలో విూనమేషాలు లెక్కిస్తుండటంపై సోషల్‌ విూడియాలో వినిపిస్తున్న టాక్‌ ఏంటి?

ఏపీలో వైసీపీ ప్రభుత్వ

రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా తయారవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది … అక్రమార్జన కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్‌ … సదరు అవినీతి మరకలను అందరికీ అంటించేపనిలో ఉన్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు … అదే సమయంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టే … చంద్రబాబును అరెస్ట్‌ చేసి సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారంటున్న …ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సోషల్‌ విూడియాలో నెటిజన్‌లు కౌంటర్లు ఇస్తున్నారు.మరి బాబాయ్‌ వైఎస్‌ వివేకాను హత్య చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నలు గుప్పిస్తున్నారు …. ఆర్ధికపరమైన కేసులో ఆరోపణలు ఉంటేనే అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మర్డర్‌ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదోకూడా సజ్జల వివరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినా, ఛార్జిషీట్లు దాఖలు చేసినా పోలీసులు మాత్రం అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా వెనకడుగు వేస్తున్నారు … అవినాష్‌ అరెస్టు కాకపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .. చట్టం ముందు అందరూ సమానమే అన్నది అవినాష్‌ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కూడా కేంద్ర పెద్దల హస్తం ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దానికి తగ్గట్టే తాజాగా లండన్‌ టూర్‌ ముగించుకునివచ్చిన జగన్‌.. ఢల్లీి బాట పడుతుండటం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది..మరోవైపు జగన్‌కు మద్దతిస్తే తమకు ఏ అంశంలోనూ ఎదురుచెప్పడన్న ఆత్మవిశ్వాసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.. ఇప్పటికే రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై జగన్‌ మెదపడటం లేదు … కనీసం పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు వాటి ప్రస్తావన తేవడం లేదు ..స్పాట్‌ వివేకా హత్యకేసులో ఫోకస్‌ అయ్యేవరకు అవినాష్‌ రెడ్డి గురించి ఏపీలోనే పలువురికి తెలియదు .. జగన్‌ సోదరుడి వరుస అయిన ఆయన కడప జిల్లాలకే పరిమితం.. అలాంటి అవినాష్‌ రెడ్డిని అరెస్టుచెయ్యడానికి సీబీఐ ఎందుకు వెనకాడుతోంది …అవినాష్‌ను అరెస్ట్‌ చేయడానికి సీబీఐ ఎందుకు ఆపసోపాలు పడుతోంది? అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది … చంద్రబాబు జైలుకి వెళ్ళడానికీ, అవినాష్‌రెడ్డి బయటే ఉండటానికి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు తేలిగ్గానే అర్ధమైపోతున్నాయంటున్నారు నెటిజన్లు … మరి దీని ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *