మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఈరోజు హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.
షరా మామూలుగానే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ లో అధికారంలోవున్న బిజెపిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిజెపి ఈ విమర్శలను గట్టిగా ఖండిస్తోంది.
ఈ రాజకీయ విమర్శలు , ప్రతి విమర్శలు పక్కనపెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో భయంకరమైన కుట్రలు తెలుస్తాయి.
మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ అతి విలువైన మణులు విరివిగా దొరికేవట. పురి అంటే పట్టణం. మణుల పురం మణిపూర్ గా మారింది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లొనే. వారి కొడుకైన బబృవాహనుడు , మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేసాడు. వైష్ణవ పరంపర కు చెందిన హిందువులు అక్కడ జీవించేవారు.
కానీ 19 వ శతాబ్దం లో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించారో అప్పటినుండి అక్కడ అవాంఛనీయ మైన మార్పులు రావడం మొదలయ్యింది. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగృ బ్యాప్టిస్ట్ గా మారి మతమార్పిడి పనులను వేగవంతం చేసాడు.
మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం , కొండప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు వుంటారు. కొండ ప్రాంతంలో ఆదివాసీలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా వుండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. పెట్టిగృ మొదట లోయలోని హిందువుల దగ్గర మతమార్పిడి ప్రయత్నం చేసాడట. హిందువులు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని , ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగృ బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేసాడు. సేవ , విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి *వాటికిన్ రాబర్ట్ , యు. ఎం .ఫాక్స్ , డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు.
వాళ్ళ ఎజెండా లో భాగంగా ఆదివాసుల జీవనవిధానం , ఆరాధన పద్దతులు , బట్టలు కట్టుకునే పద్దతులు అన్నీ అనాగరికమైనవని , సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు , హిందూ మతంలో అందరు దేవుళ్ళు ఎలా వుంటారని , ఆదివాసుల మనసుల్లో అనుమానాలు , అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసివుంటున్న ఆదివాసులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకొనేలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు.
అంత చేసినా మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితం అయ్యింది. 1911 సంవత్సరానికి మతం మారిన హిందువులు అతికొద్ది గానే వున్నా , ప్రతి గ్రామంలోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. “మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తు లో చూస్తారు ” అనేవాడట పెట్టిగ్రు.
1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్యప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1951 కి మణిపూర్ లో 12 శాతం క్రైస్తవులు గా మారారు.
నెహ్రు -ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆదివాసిలను ప్రధాన స్రవంతి లోకితీసుకురావడం , వారి జీవన స్థితి గతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి క్రైస్తవ మిషనరీలను ఆ ప్రాంతంలోకి అనుమతించి , హిందువులను మాత్రం దూరంగా వుంచారు. ఫలితంగా మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే , ఈశాన్యం మాత్రం చర్చిలు , బైబిళ్ళతో నిండిపోయింది.
ఇది ఎక్కడికి దారి తీసిందంటే 1951 లో 12 శాతం వున్న క్రైస్తవులు 1961 కి 20 శాతానికి పెరిగారు. బర్మా లోవున్న కుకీలను కూడా మణిపూర్ కు రప్పించారు. ఫలితంగా మతం మారిన కుకీలు , ఇతర ఆదివాసుల సంఖ్య 41 శాతానికి పెరిగింది. మతం మారి క్రైస్తవులైన కుకీలకు STహోదా కల్పించి , మతం మారకుండా వున్న హిందువులకు మాత్రం కేవలం OBC హోదా మాత్రమే ఇచ్చారు. ఈ హిందువులు కొండ ప్రాంతాల్లో కి వెళ్లి నివాసం వుండకుండా నిషేధం విధించారు. దాంతో హిందువులు కేవలం 10 శాతం భూభాగం కలిగిన ఇంఫాల్ లోయకే పరిమితమయ్యారు. అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు. ఈ మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు. ప్రభుత్వఉద్యోగాల్లో వాళ్లదే సింహభాగం. అంతేకాదు , ఈ మతం మారి క్రైస్తవులైన కుకీలకు American Baptist. Churches నుండి నిధులు ప్రవహిస్తున్నాయి. ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి మణిపూర్ లో హిందువులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఇపుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20 న మణిపూర్ హైకోర్టు మతం మారకుండా హిందువులు గానే మిగిలిన మీటెల్ అనే ఆడివాసీలను కూడా కుకీల లాగా ST లలోకి కలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ST హోదా లభిస్తే హిందువులు అయిన మీటేల్ ఆదివాసులు , ఇతర హిందువులు భూభాగాలను కొంటారని తెలిసిన మతం మారిన కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు.
మన రాజ్యాంగంలోని 25 వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేసుకొంటున్నాయి. ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు , వేర్పాటువాద ఉద్యమాలు ఎక్కువౌతున్నాయి.
ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛ ఈ దేశంలోనే వుంది ! రాజ్యాంగ సభలో సభ్తుడైన శ్రీ లోకనాథ్ మిశ్రా మత ప్రచారం చేసుకొనే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని , అది లౌకికరాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది.
ఈనాడు మణిపూర్ లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారత దేశంలోని చర్చిలు , విదేశాల్లోని చర్చిలు సైద్ధాంతికంగా , ఆర్థికంగా , ఆయుధపరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి.
హిందువులు మతం మారి క్రైస్తవులు అయితే ఏంటి నష్టం? అని అడిగేవారు ఒక్క సారి మణిపూర్ ఈరోజు ఎలా వుందో చూడాలి. ఇలానే వదిలేస్తే దేశంలో ఇంకా చాలా మణిపూర్లు తయారౌతాయి.