ఖమ్మం లో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సోమవారం నాడు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, వారి ఆరోగ్య వివరాలు రోగులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అలానే బోనకల్ మండలం జానికీపురం గ్రామ సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు కుమారుడు మురళి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆ వార్డు కు వెళ్లి వారితో మాట్లాడి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల తో మాట్లాడి తెలుసుకున్నారు. జడ్పీ చైర్మన్ కమల్ రాజు వెంట ఆసుపత్రి ప్రధాన వైద్యులు వెంకటేశ్వర్లు , సిబ్బంది ఉన్నారు.